VSP: ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని, అప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన ‘సారథ్యం ముగింపు సభ’లో ఆయన ప్రసంగిస్తూ.. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా బీజేపీ అవకాశవాదం పాటించదని, సిద్ధాంతాలు, కేడర్‌పై ఆధారపడే పార్టీ అని స్పష్టం చేశారు.