KMR: నాగీడ్డిపేట మండలంలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు గ్రామాలలో ఆదివారం రోజు నాగిరెడ్డిపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ సృజన్ కుమార్ తెలిపారు. 400 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి మందులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ANM పాల్గొన్నారు.