AP: మాజీ మంత్రి రోజాకు మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే అర్హత రోజాకు లేదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రోజా జబర్ధస్త్‌లో పాల్గొనలేదా?.. పర్యాటక మంత్రిగా ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. పవన్‌కు డబ్బు సంపాదనపై యావ లేదన్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారని కొనియాడారు.