NRML: జిల్లాలో విషాద ఘటన జరిగింది. భైంసా మండలం పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ పరిధిలోని కోతుల్గావ్ గ్రామ పరిసరాలలోని చెక్‌డ్యామ్‌లో ఆదివారం వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మహాగాం గ్రామానికి చెందిన పవర్ రాజుగా (36) గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.