అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు ఆదివారం టీడీపీ పార్టీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వంలో టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం, రూపానంద రెడ్డి అభివృద్ధి పనులను మెచ్చుకుంటూ వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో సాధించారని గ్రామస్థులు తెలిపారు.