VKB: కోట్పల్లి నుంచి పెద్దేముల్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవలి వర్షాలకు రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు తరచూ గాయాలపాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదివారం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.