E.G: కొవ్వూరు మండలం పంగిడిలోని షాలేం ప్రార్థనా మందిరానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ఉచిత వాహన సేవను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ వాహనం ప్రార్థన సమయంలో వారిని మందిరానికి తీసుకువచ్చి, అనంతరం వారి స్వగృహంలో దిగబెట్టేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.