HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెట్టి చాకిరి చేస్తున్న ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ బృందం గుర్తించింది. మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించిన ఆర్పీఎఫ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు విముక్తి కల్పించారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసానికి చర్యలు ప్రారంభించారు.