NTR: నందిగామ ఉమా కాలనీలో సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీపీఎం కార్యదర్శి గోపాల్ పాల్గొని ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.