KRNL: బాల బాలికలు చిన్ననాటి నుంచి ఆత్మరక్షణ కోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలో సాధన చేయాలని ఆంధ్రప్రదేశ్ కరాటే సంఘం అధ్యక్షులు కోలా ప్రతాప్ స్పష్టం చేశారు. ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోని కరాటే హాలులో బాల బాలికలకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన బాల బాలికలకు ప్రశంసా పత్రాలు, కలర్ బెల్టులు ప్రధానం చేశారు.