NRML: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బొజ్జో అన్నారు. మండలంలోని సారంగాపూర్ గ్రామంలో రూ.12లక్షలతో మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.