KDP: సీనియర్ సిటిజన్స్ సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు ఎన్, ముని గోపాల కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ మదనపల్లె పట్టణంలోని జి.ఆర్.టి హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం మంత్రిత్వ శాఖతో కూడుకున్న సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా వారి సమస్యలు పరిష్కరించేందుకు సులభతరం అవుతుందన్నారు.