TPT: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16న ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప మిగతా వీఐపీలకు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో, 15న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయం గుర్తించి భక్తుల సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.