NDL: లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఇవాళ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో నంద్యాల MP బైరెడ్డి శబరి 11వ స్థానంలో నిలిచారు. ఆమె లోక్‌సభలో మొత్తం ప్రశ్నలు 78 అడగగా, 09 చర్చల్లో పాల్గొన్నారు.