AKP: రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చూడాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. చోడవరంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రమేష్ బాబు మాట్లాడుతూ.. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలన్నారు.