SRCL: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. వేములవాడలో పలువురు మహిళలు ఆయనను కలిసి సన్మానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు.