విశాఖ వ్యాలీ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక ఎరుబండి ఆద్య విశాఖ నగర పరిధిలోగల కంబాల కొండపై ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసింది. తన తండ్రి భరత్తో కలిసి ఆదివారం విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తిచేసి పలువురి ప్రశంసలు అందుకుంది. కంబాలకొండపై ట్రెక్కింగ్ చేయడం కష్ట సాధ్యమని పలువురు పేర్కొన్నారు.