తాను తల్లి కాబోతున్నట్లు హీరోయిన్ సోనారిక SM వేదికగా వెల్లడించారు. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో ఆమె నిశ్చితార్థం జరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. కాగా, సోనారిక తెలుగులో ‘జాదుగాడు’, ‘స్పీడున్నోడు’, ‘ఈడోరకం ఆడోరకం’ తదితర మూవీల్లో నటించారు.