NLG: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో జల శోభను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. నిండుకుండలా మారిన రిజర్వాయర్, ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని చూసి ఆనందించారు. దీంతో నాగార్జునసాగర్‌లో పర్యాటక సందడి నెలకొంది. పర్యాటకుల అధిక రాకతో టాపిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు.