ప్రకాశం: జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లితే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తామని పేర్కొన్నారు.