HNK: కాజీపేట మండలం సోమిడి గ్రామంలో ఈ నెల 17న శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞం నిర్వహిస్తామని, విశ్వబ్రాహ్మణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శృంగారపు బిక్షపతిచారి, సంచర్ల రవీంద్రచారి తెలిపారు. 17న ఉదయం 8:30 గంటలకు యజ్ఞం ప్రారంభమవుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయంవతం చేయలని తెలియజేశారు. అనంతరం యజ్ఞానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.