TPT: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ఆదివారం ఏపీ పాలిటెక్నిక్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ పాషా కలిసి తమ సమస్యలు పరిష్కారానికి వినతి పత్రం అందించారు. సీపీఎస్ ఉద్యోగలకు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేసేలా చూడాలని వినతిపత్రంలో కోరారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.