TG: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలపై ఈగల్, RPF పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో HYDలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 91 కిలోల గంజాయితో పట్టుబడ్డ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 32 కిలోల గంజాయి, వరంగల్‌లో 214 కిలోలు, ములుగులో 30కేజీల గంజాయితో పాటు రూ.16.31 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.