PKL-12లో తమిళ తలైవాస్ యాజమాన్యానికి కెప్టెన్ పవన్ షెరావత్కు మధ్య వివాదం నెలకొంది. పవన్ షెరావత్‌ను క్రమశిక్షణ చర్యల కారణంగా జట్టు నుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన పవన్.. ‘నేను ఏ తప్పు చేయలేదు. ఒక వేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే జీవితంలో కబడ్డీ ఆడను’ అని తెలిపాడు. కాగా, ప్రస్తుతం అతడు భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు.