MBNR: తెలంగాణలో సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలని ఆదివారం ఎంపీ డీకే అరుణ అన్నారు. అక్కాచెల్లెలు అందరూ పాల్గొనాలని, అన్నలు సహకరించాలని కోరారు. ఈ నెల 21 నుంచి 30 వరకు ప్రతి జిల్లాలో సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.