SRD: పటాన్ చెరులో అమేధా హాస్పిటల్ వారి సహకారంతో CITU ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని CITU నాయకుడు కే. రాజయ్య తెలిపారు. స్థానిక సీఐ వినాయక రెడ్డి ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారని అన్నారు. గతంలో CITU ఆధ్వర్యంలో ఇటువంటి మెడికల్ క్యాంపులు ఎన్నో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.