ASR: కొయ్యూరు మండలం సింగవరం రైతుసేవ కేంద్రం వద్ద రాజ్మా విత్తనాల కోసం రైతులకు ఆదివారం బారులు తీరారు. ఒక రైతుకు 10 కిలోల చొప్పున రాజ్మా విత్తనాలను విక్రయించారు. అయితే ఎకరాకు కనీసం 18 కిలోల విత్తనాలు అవసరం అని రైతుల తెలిపారు. 18 కిలోల విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాల కొరత లేకుండా చూస్తామని AO రాజకుమార్ పేర్కొన్నారు.