KRNL: ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 48,483 విలువ గల చెక్కు ఇవాళ పగిడ్యాల మండలం, ప్రాతకోటకు చెందిన భారతికి ఎమ్మెల్య జయసూర్య అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్య జయసూర్యకు భారతి కృతజ్ఞతలు తెలిపారు. మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.