KDP: కూటమి ప్రభుత్వ పాలన నచ్చి వైసీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఇవాళ స్థానిక టీడీపీ కార్యాలయంలో సోములవారిపల్లె పంచాయితీ పెన్నానగర్కు చెందిన వైసీపీ మైనార్టీ కుటుంబాలను ఎమ్మెల్యే టీడీపీలో చేర్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.