AP: విశాఖలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని నడ్డా తెలిపారు. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని అన్నారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందన్నారు. ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.