GNTR: తెనాలి నియోజకవర్గం, సుల్తానాబాద్‌కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు కన్నెగంటి ఝాన్సీ రాణి ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.