TPT: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీరు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్వాగతం పలికారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీ కాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గవర్నర్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తిరుపతిలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన పాల్గొంటారు.