ASF: సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ నెం.12591 గోరఖపూర్- యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ రైలుకు నూతనంగా హాల్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం MLA హరీష్ బాబు హాల్ట్ అయిన రైలుకు పచ్చ జెండా ఊపి సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. రైళ్ల హాల్టింగులతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.