TG: పార్టీ మారిన MLAలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వారు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. తనకు నోటీసులు ఇస్తే.. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే సమాధానమిస్తా అని పేర్కొన్నారు. కాగా, MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగిలిన MLAలు పార్టీ మార్పుపై స్పీకర్‌కు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.