SKLM: ఇచ్ఛాపురం తపాలా కార్యాలయ భవనం పైకప్పు పెచ్చులూడి పడటంతో ఒకరికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కార్యాలయంలో రద్దీ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. అక్కడ ఉన్న కొందరు అప్రమత్తమై త్రుటిలో తప్పించుకోగా విశ్రాంత ఉద్యోగి బాబూరావు భుజంపై పెచ్చు ముక్క పడటంతో గాయమైంది. సిబ్బంది, ప్రజలు బయటకు పరుగుతీశారు.