KKD: కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు కాకర్ల నారాయణమూర్తి మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ నుంచి రూ.5 లక్షల బీమా సాయం అందింది. శనివారం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మృతుడి నివాసానికి వెళ్లి, ఆయన భార్య సత్యవతికి చెక్కు అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఈ బీమా సౌకర్యం కల్పించారని ఆయన తెలిపారు.