ప్రకాశం: మర్రిపూడి మండలంలోని శివరాయుని పేట గ్రామంలో శనివారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 42,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ప్రజలు జూదానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.