JN: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ల్యాండ్ సర్వేయర్స్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.