SKLM: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నుంచి ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్,తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.