SRCL: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మార్త సత్తయ్య అన్నారు. చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నాడు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం విజయవంతం చేయాలన్నారు.