గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భరూచ్ జిల్లా సంఘ్వి ఆర్గానిక్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10కి పైగా ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.