SRPT: నూతనకల్ మండలం శిల్పకుంట్ల సమీపంలో ఆదివారం చేపల లోడుతో వెళుతున్న వాహనం డోరు విరిగిపడడంతో చేపలన్నీ రోడ్డుపై ఉన్న నీళ్ల గుంటల్లో పడిపోయాయి. సంగెం మీదుగా తుంగతుర్తికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనను చూసిన స్థానికులు వెంటనే వలలు వేసి రోడ్డుపై పడిన చేపలను పట్టుకున్నారు.