ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. నైపుణ్యం, కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా నిరూపిస్తున్నారని తెలిపారు. ఆయన సంగీతం తల్లిగా జోల పాడుతోందని, ప్రేమ భావోద్వేగాలను కీర్తిస్తోందని అన్నారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేలా ఏటా ఇళయరాజా పేరిట పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు.