RR: రాజేంద్రనగర్ పరిధిలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి ఆరాంఘార్ వెళ్తున్న స్విఫ్ట్ VXI కారు (TS09FU1297) అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కబీర్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు గాయపడ్డారని NSO డ్యూటీ రిపోర్టులో తెలిపారు.