AP: తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చించనున్నారు.