కన్నడ హీరో ధృవ్ సర్జా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘కేడీ: ద డెవిల్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరో కిచ్చా సుదీప్ భాగం అయ్యారు. ఇందులో ఆయన గెస్ట్ రోల్ చేయనుండగా.. ఇవాళ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మేరకు సెట్ నుంచి ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం అక్టోబర్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.