కృష్ణా: నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో యూరియా సరఫరా స్థితిగతులను కలెక్టర్ డీ.కే. బాలాజీ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల అవసరాన్ని బట్టి యూరియా పంపిణీ జరుగుతుందని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.