GNTR: తాడేపల్లి పరిధి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడు కట్టమీద ఉన్న గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్‌కు మరమ్మతులు జరుగుతున్నాయని గుంటూరు ఛానల్ డీఈ తెలిపారు. ఆదివారం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయని, ఉండవల్లి నుంచి సెంటర్‌కి ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ రహదారిని ఎంచుకోవాలని సూచించారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.