KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం వరకు 3,051 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు డీఈ వెంకటశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం కనివిని ఎరుగని రీతిలో ప్రాజెక్టులోకి 22.336 టీఎంసీల వరదతో చరిత్ర సృష్టించిందన్నారు. 1.820 టీఎంసీల సామర్థ్యం కలిగినప్పటికీ అంతకు పది రెట్లు వరదలు వచ్చినా తట్టుకుందన్నారు.