ASF: ఆదివాసీ నాయకులపై లంబాడా నాయకులు విమర్శలు చేస్తే సహించేది లేదని తుడుం దెబ్బ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడు పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆదివాసీ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. ఆదివాసీలకు రావాల్సిన ఫలాలు రావడం లేదని ఆరోపించారు.